బ్రేకింగ్ గాసిప్: మొత్తానికి ఎన్టీయార్ మేల్కొన్నాడా.?
- September 02, 2022
‘ఆచార్య’ ఎఫెక్ట్ కొరటాల శివను వెంటాడుతూనే వుంది. ఇటీవల చిరంజీవి కూడా ‘ఆచార్య’ వైఫల్యంపై కొరటాల శివ తప్పుందంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఓ సినిమా ఫంక్షన్‌లో క్లారిటీ ఇచ్చేశాడు. దాంతో ఎన్టీయార్ ఓ నిర్ణయానికి వచ్చేశాడట.
ఈ పరిస్థితుల్లో కొరటాలతో సినిమా చేయం అంత మంచిది కాదని అభిప్రాయపడుతున్నాడట. అనుకున్నదే తడవుగా కొరటాలని ఎన్టీయార్ పక్కన పెట్టేశాడనీ ప్రచారం జరుగుతోంది. కానీ, అర్జెంట్‌గా ఎన్టీయార్ తన కొత్త ప్రాజెక్ట్‌ని రంగంలోకి దించాల్సిన అవసరం వుంది.
ఆ క్రమంలో తన కొత్త ప్రాజెక్ట్ కోసం కెప్టెన్ ఆఫ్ ది షిప్.. అదేనండీ డైరెక్టర్‌గా బుచ్చిబాబు సనను లైన్‌లో పెట్టాడట. ‘ఉప్పెన’ సినిమాతో బుచ్చిబాబు సన తన డైరెక్షన్ క్రియేటివిటీని ప్రూవ్ చేసుకున్నాడు. ఓ కొత్త హీరోతోనే ఆ స్థాయి హిట్ కొట్టిన బుచ్చిబాబు సన, ఎన్టీయార్‌లాంటి హీరోతో ఎలాంటి మ్యాజిక్ చేయగలడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అన్నీ సెట్ అయితే, త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక దృవీకరణ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఈ ప్రాజెక్టుకు ఎ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ అందించనున్నాడనే ప్రచారం కూడా వుంది. సో, ఇదిగో అదిగో అంటూ ఊరించిన కొరటాల శివ, ఎన్టీయార్ మూవీ అయితే ఇప్పట్లో లేదనే సంకేతాలే వినిపిస్తున్నాయ్. ఇక కంప్లీట్ క్లారిటీ రావాలంటే జస్ట్ కొద్ది రోజులు మాత్రమే ఆగాల్సి వుంది. జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో కానీ, మొత్తానికి ఎన్టీయార్ ఇప్పటికైనా మేల్కొన్నాడులే అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారట.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







