సింగపూర్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

- September 03, 2022 , by Maagulf
సింగపూర్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

సింగపూర్: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా  వినాకయ చవితి పూజాకార్యక్రమం స్థానిక పిజిపి హాల్ నందు వినాయక నామ జయజయద్వానాలు నడుమ ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది.గత రెండు సంవత్సరాల కోవిడ్  నిబంధనల తరువాత ప్రత్యక్షంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో సుమారు 100 మంది బాలబాలికలు వారి స్వహస్తాలతో  అరుదైన 21 పత్రాలతో బాల గణపతి పూజ చేశారు. ప్రత్యేకంగా అలంకరించబడి ముగ్ధమనోహరంగా తీర్చిదిద్దిన గణనాధుని ప్రధాన విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పూజలో భాగంగా వేదపండితులు తెలిపిన గణేశ వైభవం, సంసృతి , సంప్రదాయాల వివరణ, పూజా వైశిష్టం పెద్దలతో పాటు పిల్లలు కూడా అత్యంత ఆసక్తితో ఆలకించారు.

ఈ సందర్భంగా సమాజ అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తూ, పూజ లో పాల్గొన్న పిల్లలందరికీ ప్రత్యేకంగా మట్టితో చేసిన బాల గణపతి విగ్రహాన్ని అందించామని, అలాగే సుమారు 500 మందికి అన్నిరకాల 21 పత్రిని ఉచితంగా పంచి తృప్తి చెందామని తెలిపారు.కార్యక్రమ నిర్వాహకులు రవి సోమా మాట్లాడుతూ అందరికి ఆ వినాయకుని ఆశీస్సులు అందాలనే ఉద్దేశ్యంతో నిర్వహించిన పూజా కార్యక్రమానికి సుమారు 500 ప్రత్యక్షంగా,3500 మంది అంతర్జాలం ద్వారా వీక్షించడం జరిగిందని తెలిపారు. అందరి మంచికోసం నిర్వహించిన ఈ పూజా కార్యక్రమం విజయవంతం కావడంలో ఎంతోమంది సహాయ సహకారాలు అందించారని తెలిపారు.కార్యవర్గసభ్యులకు, దాతలకు , పూజా కార్యక్రమంలో పాల్గొన్నవారికి, పిల్లలకు, స్వఛ్ఛంద సేవకులకు కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలియజేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com