తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
- September 03, 2022
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. సెప్టెంబర్ 17 అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజుకుంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. అటు సీఎం కేసీఆర్ కూడా తగ్గేదేలే అంటున్నారు. బీజేపీకి చెక్ పెట్టేలా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ప్రారంభోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది.
కాగా.. సెప్టెంబర్ 17 సెంటిమెంట్ ను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్న బీజేపీ ఇప్పుడు మరో ఎత్తుగడ వేసింది.హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రారంభ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు కిషన్ రెడ్డి లేఖ రాశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







