ఫింటాస్‌లో బూజ్ తయారీ ముఠా అరెస్ట్
- September 04, 2022
కువైట్: స్థానికంగా మద్యాన్ని తయారు చేసి దిగుమతి చేసుకున్న బాటిళ్లలో నింపి అమ్ముతున్న ముఠాను అహ్మదీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఫింటాస్‌లో ఏర్పాటు చేసిన బూజ్ తయారీ కర్మాగారాన్ని పోలీసులు ధ్వంసం చేశారు.ఈ ఘటనకు సంబంధించి నలుగురు ఆసియన్లను పోలీసులు అరెస్టు చేశారు. మేజర్ జనరల్ వాలిద్ అల్-షెహాబ్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. పబ్లిక్ సెక్యూరిటీ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అబ్దుల్లా అల్-రజీబ్కు నివేదిక సమర్పించామని, నిందితులను దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. బూజ్ తయారీ కర్మాగారం నుంచి మద్యం, తయారీ సాధనాలు, ప్రింటింగ్ సామగ్రి, నగదును స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!