అద్దె వివాదం.. ఇంటి యజమానిని హత్య చేసిన యువకుడు..!

- September 04, 2022 , by Maagulf
అద్దె వివాదం.. ఇంటి యజమానిని హత్య చేసిన యువకుడు..!

బహ్రెయిన్: అద్దె విషయంలో తలెత్తిన చిన్న వివాదం చివరికి హత్యకు దారి తీసింది. 21 ఏళ్ల యువకుడు తన ఇంటి యజమానిని కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకునేందుకు ఓ కస్టమర్ సంప్రదించాడు. ప్లాట్ ను స్వయంగా చూసేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. తీరా ప్లాట్ చూడాల్సి సమయం రాగా.. ప్లాట్ ఓనర్ కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పలుమార్లు ప్రయత్నించినా లాభం లేకపోవడంతో స్వయంగా ప్లాట్ చూసేందుకు ప్లాట్ ఓనర్ ఇంటికి బయలుదేరారు. ప్లాట్ తలుపులు తెరిచి ఉండటంతో అనుమానంతో పరిశీలించగా .. అప్పటికే రక్తం మడుగులో ఇంటి ఓనర్ పడి ఉన్నాడు. దీంతో ప్లాట్ చూసేందుకు వచ్చిన కస్టమర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఈ భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫోరెన్సిక్ బృందం నేరస్థలం నుండి అనేక DNA నమూనాలు, వేలిముద్రలను సేకరించింది. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి డీఎన్‌ఏ, వేలిముద్రలు సరిపోలాయి. నిందితుడైన ఆసియా వాసి.. ముందస్తు ప్లాన్ ప్రకారమే ఇంటి ఓనరును హత్య చేశాడని, అంతకు ముందు వారిద్దరి మధ్య అద్దె విషయంతో గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆ వ్యక్తిపై ముందస్తు హత్యా నేరం మోపింది. నేరం రుజువైతే, కోర్టు అతనికి ఉరిశిక్ష విధించవచ్చు. ఈ కేసుపై హైకోర్టు విచారణ ప్రారంభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com