ఫింటాస్‌లో బూజ్ తయారీ ముఠా అరెస్ట్

- September 04, 2022 , by Maagulf
ఫింటాస్‌లో బూజ్ తయారీ ముఠా అరెస్ట్

కువైట్: స్థానికంగా మద్యాన్ని తయారు చేసి దిగుమతి చేసుకున్న బాటిళ్లలో నింపి అమ్ముతున్న ముఠాను అహ్మదీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఫింటాస్‌లో ఏర్పాటు చేసిన బూజ్ తయారీ కర్మాగారాన్ని పోలీసులు ధ్వంసం చేశారు.ఈ ఘటనకు సంబంధించి నలుగురు ఆసియన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.  మేజర్ జనరల్ వాలిద్ అల్-షెహాబ్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. పబ్లిక్ సెక్యూరిటీ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అబ్దుల్లా అల్-రజీబ్‌కు నివేదిక సమర్పించామని, నిందితులను దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. బూజ్ తయారీ కర్మాగారం నుంచి మద్యం, తయారీ సాధనాలు, ప్రింటింగ్ సామగ్రి, నగదును స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com