గణేశ్ నిమజ్జనం ఏర్పాట్ల పై సమీక్షించిన మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి

- September 04, 2022 , by Maagulf
గణేశ్ నిమజ్జనం ఏర్పాట్ల పై సమీక్షించిన మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి

హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని శాఖల సమన్వయంతో గణేశ్ నిమజ్జనం  పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు.జిహెచ్ఏంసి ప్రధాన కార్యాలయంలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై మేయర్ జోనల్ కమిషనర్ లు, పోలీస్,విద్యుత్ శాఖ,వాటర్ వర్క్స్,ఈవిడిఏం శాఖలతో శనివారం  మేయర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గణేశ్ నిమజ్జనం కోసం ఎలాంటి ఇబ్బందులూ లేకుండా  అన్నివసతులు సౌకర్యాలు కల్పించాలని అన్నారు.నగరంలో 74  కొలనులను ఏర్పాటు చేసిన నేపథ్యంలో వ్యర్ధాలను తొలగించేందుకు శానిటేషన్ సిబ్బందిని 3 షిఫ్ట్ లలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కొలనులో వేసిన విగ్రహాలను వెనువెంటనే కృత్రిమ( పార్తెబుల్) కొలనులలో ఎప్పటి కప్పుడు నీరు నిప్పడం చేయాలన్నారు. జోనల్ వారీగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం కొలను రోజువారీగా సమాచారం ఇవ్వాలని తెలిపారు.మండపం నుండి నిమజ్జనానికి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొనిపోయే సందర్భంలో చెట్లకొమ్మలు తొలగించడం  విద్యుత్ తీగలను వ్రేలాడకుండ చర్యలు చేపట్టాలన్నారు.అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలన్నారు.

కొలను వద్ద ఎక్కువ కెపాసిటీ గల  ప్రత్యేక ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.భక్తులకు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా  సరిపోను నీటి ప్యాకెట్లను నీటి వసతి  ఏర్పాటు చేయాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు.నిమజ్జనం సందర్భంగా వాహనాల క్రమబద్దీకరణ చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ అధికారులు కృషి చేయాలన్నారు.విగ్రహాల ఊరేగింపు సందర్భంగా వేసిన చెత్తను వెనువెంటనే  తొలగించాలని అందుకు కావల్సిన పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయాలని జిహెచ్ఏంసి అధికారులతో పాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా   జాకెట్లు తప్పని సరిగా వేసుకోవాలని   మేయర్ అధికారులను ఆదేశించారు.

కొలనుల వద్ద అవసరమైన క్రేన్లను ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్ల  ఆదేశించారు.
అంతర్గత,ప్రధాన రోడ్లను మరమ్మత్తుల చేపట్టాలన్నారు.నిమజ్జనం సందర్భంగా ఫ్లెక్సీలు బ్యానర్లు కటౌట్ లు వలన ఊరేగింపు సందర్భంగా ఇబ్బందికి లేకుండా ఈవిడిఏం అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ సందర్భంగా 100 మంది గజ ఇతగళ్లను బోట్లను  అవసరం మేరకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్ కమిషనర్ బి సంతోష్ మాట్లాడుతూ ..
మొత్తం 10 వేలమంది శానిటేషన్ సిబ్బంది నియమించామని ప్రతి  3 నుండి 4 కిలో మీటర్ల వరకు  మొత్తం 25 శానిటేషన్ సిబ్బంది.కొలనుల వద్ద ఒక క్రేన్ కు 7 నుండి 14 వరకు సిబ్బంది 3 షిఫ్టుల్లో 24 గంటలు పనిచేస్తారని చెప్పారు.మొత్తం280 క్రేన్లు  కాగా  అందులో 130 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు .100 మంది  గజ ఈతగాళ్లను అదే విధంగా బోట్లను ఏర్పాటు చేస్తామని ఈవిడిఏం  అధికారులు  మేయర్ కు వివరించారు.కాప్ర,సరూర్ నగర్ చెరువులలో రెండేసి చొప్పన బోట్లు ఏర్పాటు చేయాలన్నారు.

అన్నిశాఖల  సమన్వయంతో నిమజ్జనం సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు డి సి పి రమణ రెడ్డి వివరించారు.ఈ సమావేశంలో ఈఏన్ సి జియా ఉద్దీన్, జోనల్ కమిషనర్ లు రవి కిరణ్, శంకరయ్య,  శ్రీనివాసరెడ్డి , మమత,  పంకజ, చీఫ్  మెడికల్ అండ్  హెల్త్ అధికారి డాక్టర్ పద్మజ  వాటర్ వర్క్స్ ఎలక్ట్రిసిటీ , చార్మినార్ జోన్ యస్ ఈ  తదితరులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com