వీసా జారీకి సంబంధించి అమెరికా కీలక నిర్ణయం
- September 04, 2022
అమెరికా: వీసా జారీకి సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.పలు కేటగిరీల వీసాల కోసం అభ్యర్థులు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఈ నెలలో సాధారణ వ్యక్తి బీ1( వ్యాపారం), బీ2(పర్యాటకం) వీసా అపాయింట్మెంట్ల ప్రాసెసింగ్ ను అమెరికా తిరిగి ప్రారంభించింది.అయితే వివిధ కేటగిరీల వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూల కోసం వ్యక్తిగతంగా హాజరు కావాలా? వద్దా? అనే విషయాన్ని సంబంధిత కాన్సులార్ ఆఫీసర్ నిర్ణయిస్తాడని అమెరికా ఎంబసీ వెల్లడించింది.
ఎఫ్, హెచ్-1, హెచ్ -3, హెచ్ -4, నాన్ బ్లాంకెట్ ఎల్, ఎం, ఓ, పీ, క్యూ, అకడమిక్ జే వంటి కేటగిరీలోని వారికి ఇంటర్వ్యూలకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే, ఈ వెసులుబాటు గతంలో ఏదోఒక వీసాను పొందిన వారికే ఉంటుంది. అలాగే, గతంలో ఏదైనా వీసా దరఖాస్తు రిజెక్ట్ అయిన వారికి ఈ సదుపాయం లభించదని స్పష్టం చేసింది.వీసా గడువు ముగిసిన వారు, గడువు ముగిసి రెండు సంవత్సరాలలోగా రెన్యువల్ కు దరఖాస్తు చేసుకుంటే.. వారు కూడా ఇంటర్వ్యూకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని వివరించింది.
ఇదిలా ఉంటే ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ నాన్ఇమిగ్రాంట్ వీసా అపాయింట్మెంట్ల వెయిటింగ్ పీరియడ్ మాత్రం ఎక్కువ కాలం ఉండనుంది.కరోనా సమయంలో కలిగిన ఇబ్బందులే ఇందుకు కారణమని అమెరికా చెప్పింది.ఇప్పటికే వీసా దరఖాస్తు రుసుం చెల్లించిన వారు వీసాల జారీకీ ఆలస్యం అవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా ఎంబసీ పేర్కొంది.కరోనా సమయంలో పేమెంట్ చేసిన వారి వ్యాలిడిటీని 2023 సెప్టెంబర్ 23వరకు పొడిగించనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం