ఫిఫా ప్రపంచ కప్.. ప్రసార పరికరాలకు దిగుమతి టాక్స్ ఎత్తివేత

- September 05, 2022 , by Maagulf
ఫిఫా ప్రపంచ కప్.. ప్రసార పరికరాలకు దిగుమతి టాక్స్ ఎత్తివేత

దోహా: రాబోయే ఫిఫా  ప్రపంచ కప్‌ 2022 వేళ ప్రసార పరికరాల వంటి వృత్తిపరమైన ఉత్పత్తులపై దిగుమతి టాక్స్ ని ఖతార్ ఎత్తివేసింది. ఈ మేరకు బ్రాడ్ కాస్టింగ్ పరికరాలను పన్ను రహిత తాత్కాలిక వస్తువుల జాబితాలోకి చేర్చింది. వీటికి సంబంధించిన అంతర్జాతీయ కస్టమ్స్ పత్రం ATA కార్నెట్‌ను ఖతార్‌లోని కస్టమ్స్ అధికారులు తాజాగా ఆమోదించారు. 2022 FIFA ప్రపంచ కప్ సమయంలో మీడియా అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖతార్ కస్టమ్స్ వర్గాలు తెలిపాయి. ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ICC), ఖతార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (QCCI) ఖతార్ కస్టమ్స్ అధికారులతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. అక్టోబర్ నుండి డిసెంబర్ 2022 చివరి వరకు బ్రాడ్ కాస్టింగ్ పరికరాలపై దిగుమతి టాక్స్ ఎత్తివేత నిర్ణయం అమల్లో ఉంటుందని కస్టమ్స్ విభాగం తెలిపింది. ఈ సందర్భంగా ఖతార్ ఛాంబర్ చేసిన అద్భుతమైన సహకారానికి ఐసిసి వరల్డ్ ఎటిఎ కార్నెట్ కౌన్సిల్ (వాటాక్) చైర్ రూడీ బోలిగర్ కృతజ్ఞతలు తెలిపారు. ATA కన్వెన్షన్,  ఇస్తాంబుల్ కన్వెన్షన్ కింద వాణిజ్య వస్తువులను సరిహద్దుల్లో స్వేచ్ఛగా(టాక్స్ లేకుండా) అనుమతించే వ్యవస్థ. ATA కార్నెట్‌లను ఉపయోగించడం వల్ల 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ కోసం 118,000 కంటే ఎక్కువ పరికరాలు చైనాలోకి తాత్కాలికంగా దిగుమతి చేయబడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com