అబుదాబి ఎయిర్ పోర్టుకు కొత్త బస్సు సర్వీస్
- September 05, 2022
యూఏఈ: అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో కొత్త బస్సు సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రాపిడ్ ఇంటర్సిటీ కోసం క్యాపిటల్ ఎక్స్‌ప్రెస్‌తో దుబాయ్ రోడ్లు, రవాణా అథారిటీ (RTA) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కొత్త సర్వీస్ ద్వారా విమానాశ్రయంలోని ప్రయాణికులు నేరుగా దుబాయ్‌లోని ఇబ్న్ బటుటా బస్ స్టేషన్ కు చేరుకోవచ్చని ఆర్టీఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ సీఈఓ అహ్మద్ హషీమ్ బహ్రోజియాన్ తెలిపారు. యూఏఈ రవాణా నెట్వర్క్ని విస్తరించడం, మెరుగుపరిచేందుకు ప్రైవేట్ సెక్టర్ సంస్థలతో ఒప్పందాలు దోహదం చేస్తాయన్నారు. క్యాపిటల్ ఎక్స్‌ప్రెస్ ఫర్ ర్యాపిడ్ ఇంటర్సిటీ సీఈఓ ఇయాద్ ఇషాక్ అల్ అన్సారీ మాట్లాడుతూ.. అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు వచ్చే ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడంతో పాటు పర్యాటకుల అనుభవాన్ని మెరుగుపరిచే ప్రయాణ సౌకర్యాలను కొత్త సర్వీస్ అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







