‘లైగర్’ ఎఫెక్ట్: ఛార్మీ ఓవరాక్షన్‌కి అలా చెక్ పడిందన్న మాట.!
- September 05, 2022
‘లైగర్’ సినిమా రిలీజ్‌కి ముందు ఛార్మీ అండ్ టీమ్ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. ప్రమోషన్ల పేరు చెప్పి దేశం మొత్తం తిరిగేశారు. సరే, సోషల్ మీడియాలో ఛార్మీ చేసిన ఓవరాక్షన్‌కి అయితే అంతే లేదు.
అదంతా సినిమా రిలీజ్ తర్వాత తీరిపోయిందంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఛార్మీని దారుణంగా ట్రోల్ చేశారు. చేస్తూనే వున్నారు. ఈ టార్చర్ తట్టుకోలేక ఛార్మీ తాజాగా సోషల్ మీడియా అకౌంట్‌కి గుడ్ బై చెప్పేసిందట.
‘ఛిల్ గయ్స్.. సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నా.. పూరీ కనెక్ట్స్ బ్యానర్ త్వరలోనే బిగ్గర్ అండ్ బెటర్‌గా బౌన్స్ బ్యాక్ అవుతుంది.. అప్పటి వరకూ లివ్ అండ్ లెట్ లివ్..’ అంటూ ఛార్మీ పోస్ట్ చేసింది.
దాంతో ఇదంతా ‘లైగర్’ ఇచ్చిన షాక్ ట్రీట్మెంటే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏ సోషల్ మీడియా వేదికగా అయితే, రెచ్చిపోయి మరీ సినిమాని ప్రమోట్ చేసిందో, రిజల్ట్ వచ్చాకా, అదే సోషల్ మీడియా దాడి తట్టుకోలేక ఎగ్జిట్ అయిపోయింది ఛార్మీ. అతిగా ఎగిరెగిరి పడితే, ఇలాగే తీరిపోతుంది.. అంటూ సామాన్య నెటిజన్లు సైతం ఛార్మీపై కామెంట్లు షురూ చేశారు.
ఇక పూరీ జగన్నాధ్ అయితే, గతంలోనే సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పేశారు. మళ్లీ ఇంతవరకూ రాలేదు. ఏది ఏమైనా ‘లైగర్’ ఇచ్చిన షాక్ నుంచి ఇప్పుడప్పుడే పూరీ అండ్ ఛార్మీ తేరుకునేలా కనిపించట్లేదు. అంత గట్టిగా కొట్టింది ‘లైగర్’ దెబ్బ.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..