కువైట్ లో డెలివరీ కంపెనీలకు కొత్త గైడ్ లైన్స్
- September 06, 2022
కువైట్: డెలివరీ కంపెనీలు తమ గైడ్ లైన్స్ కు కట్టుబడి ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు డెలివరీ కంపెనీలకు కొత్తగా గైడ్ లైన్స్ ను జారీ చేసింది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. డెలివరీ వాహనం డ్రైవర్ తప్పనిసరిగా ఫుడ్ అథారిటీ జారీ చేసిన ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. అన్ని డెలివరీ వాహనాలు తప్పనిసరిగా వాహనంపై కంపెనీ స్టిక్కర్‌ను కనిపించే విధంగా అతికించాలి. డెలివరీ చేసే సమయాల్లో డ్రైవర్ యూనిఫాం ధరించాలి. ఈ నిబంధనలు అక్టోబర్ 1, 2022 నుండి అమలులోకి రానున్నాయి. అధికారులు సూచనలకు కట్టుబడి ఉండాలని కంపెనీల యజమానులను మంత్రిత్వ శాఖ ఆదేశించింది. గైడ్ లైన్స్ ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీల లైసెన్స్‌ను రద్దు చేయడంతోపాటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ETCA ఆద్వర్యంలో ఘనంగా 15 వ మెగా బతుకమ్మ సంబరాలు
- నేడు హైదరాబాద్‌లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కార్యక్రమం ప్రారంభం
- తానా ఆధ్వర్యంలో 'ప్రతిభామూర్తులు' సభ విజయవంతం
- మైటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- ట్రోఫీని హోటల్ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ
- టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!