దోహాలో ప్రారంభమైన ‘నో పార్కింగ్’ క్యాంపెయిన్
- September 06, 2022
దోహా: నివాస ప్రాంతాలలో ట్రక్కులు పార్కింగ్ చేయకుండా నిరోధించడానికి ఇంటెన్సివ్ అవగాహన క్యాంపెయిన్ ను దోహా మున్సిపాలిటీ ప్రారంభించింది. దోహాలోని వివిధ ప్రాంతాలలో ట్రక్కులు, బస్సులను పార్కింగ్ చేయడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో మున్సిపాలిటీ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్లు పలు ప్రాంతాలలో పార్క్ చేసిన ట్రక్కులు, బస్సులను గుర్తించి వాటి డ్రైవర్లకు నిబంధనల పట్ల అవగాహన కల్పించారు. దీనితోపాటు ఆయా వాహనాలపై అవగాహన/హెచ్చరిక పోస్టర్‌లను అధికారులు అతికించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహన యజమానులు, డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని దోహా మున్సిపాలిటీ అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- నేడు హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కార్యక్రమం ప్రారంభం
- తానా ఆధ్వర్యంలో 'ప్రతిభామూర్తులు' సభ విజయవంతం
- మైటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- ట్రోఫీని హోటల్ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ
- టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!