యూఏఈ: అజ్మాన్ లో ఘనంగా జరిగిన గణపతి ఉత్సవాలు

- September 06, 2022 , by Maagulf
యూఏఈ: అజ్మాన్ లో ఘనంగా జరిగిన గణపతి ఉత్సవాలు

యూఏఈ: అజ్మాన్ లో ఎంతో  ప్రతిష్టాత్మకంగా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన  తెలుగు వారు భక్తిశ్రద్దలతో 5 రోజులు పాటు గణపతి ఉత్సవాలు నిర్వహించారు.4 అడుగుల మట్టి విగ్రహాన్ని  హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చి యూఏఈ లోని MYTRI ఫార్మ్ లో ప్రతిష్టాపన చేసి, ఆ గణ నాధునికి నిత్యం పూజలు చేస్తూ గత ఆదివారం గణ నాధుడు న్ని అంగరంగ వైభవంగా, తీన్ మార్ డప్పులు ,ఆటలు, DJ పాటలతో, పిల్లలు,పెద్దలు, ముఖ్యంగా స్త్రీల డాన్స్ లతో అలరించారు.ఈ అయిదు రోజులు ప్రతి రోజు పూజలు,నిత్య అన్న వితరణ,పిల్లలు పెద్దలతో  సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.సుమారుగా 3 వేళా మంది భక్తులు ఈ అయిదు రోజులలో ఎంతో భక్తి శ్రద్దలతో గణ నాయకున్ని దర్శించుకున్నారు.ఆ గణ నాధుని నిమజ్జన కార్యక్రమం లో అతి ముఖ్య ఘట్టం లడ్డు వేలం పాట. 

సాంప్రదాయ పద్ధతి లో జరిగిన ఈ  లడ్డు వేలం పాటలో మొదటి లడ్డును AED 1325 ను దుబాయ్ లో ఉంటున్న రామచంద్ర పురంకు చెందిన డేగల నాగేంద్ర మరియు రెండవ లడ్డును AED 1500 దుబాయ్ లో ఉంటున్న మార్టేరు కు చెందిన కర్రి లవకుశ రెడ్డి  సొంతం చేసుకున్నారు.ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కమిటీ నిర్వాహకులు కేసరి త్రిమూర్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com