యూఏఈ లో ప్రపంచంలోనే అరుదైన పింక్ డైమండ్ ఎగ్జిబిషన్
- September 06, 2022
యూఏఈ: ప్రపంచంలోనే అత్యంత అరుదైన పింక్ డైమండ్స్ లో ఒకటైన “విలియమ్‌సన్ పింక్ స్టార్” వజ్రాన్ని దుబాయ్ లో ప్రదర్శనకు పెట్టారు. దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్ (DMCC), ఫ్లాగ్‌షిప్ ఫ్రీ జోన్, కమోడిటీస్ ట్రేడ్ అండ్ ఎంటర్‌ప్రైజ్‌పై దుబాయ్ అథారిటీ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశాయి. అత్యంత ఆకర్షణీయంగా ఉండే పింక్ డైమండ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున వ్యాపారులు ఈ షో కు వస్తున్నారు. ఈ పింక్ డైమండ్ 11.15 క్యారెట్లు ఉంటుంది. అక్టోబర్‌లో హాంగ్‌కాంగ్‌లోని సోత్‌బైస్ సింగిల్-లాట్ వేలంలో దీన్ని విక్రయించనున్నారు. ఆ లోపు సింగపూర్, తైపీలలో కూడిన పింక్ డైమండ్ ఎగ్జిబిషన్ ను నిర్వహించనున్నారు. అత్యంత అరుదైన ఈ వజ్రానికి వేలంలో దాదాపు 21 మిలియన్ డాలర్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!