ప్రవాస కార్మికులకు గుడ్ న్యూస్... వర్క్ పర్మిట్ రద్దు కు వేలిముద్రల సేకరణ
- September 06, 2022
కువైట్ సిటీ: కువైట్ లో ప్రవాసులకు వర్క్ పర్మిట్ విషయానికి సంబంధించి పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ (PAM) డిపార్ట్ మెంట్ కొత్త ప్రక్రియ షురూ చేసింది.ఇక నుంచి వర్కిట్ పర్మిట్ ఉన్న కార్మికులందరి వేలిముద్రలు తీసుకోనుంది. వర్కర్స్ తో పనిచేయించుకొని చాలా మంది యాజమాన్యాలు వారికి సరైన జీతాలు ఇవ్వటం లేదు, పైగా బకాయిలు పెడుతున్నాయి.ఈ సమస్య ను నివారించేందుకు ఇలా వేలిముద్రల ప్రక్రియ ప్రారంభించింది. ఇక నుంచి ఎవరి వర్క్ పర్మిట్ రద్దు చేయాలన్న వారికి కచ్చితంగా బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా పనికి కుదిరే ముందు అగ్రిమెంట్ లో ఉన్న అన్ని సౌకర్యాలను వర్కర్స్ కు కల్పించాల్సి ఉంటుంది.ఈ నిబంధనలను యాజమాన్యాలు ఉల్లంఘించకుండా పక్కాగా వర్కర్స్ వివరాలు, వారి వేలిముద్ర లు పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ డిపార్ట్ మెంట్ తీసుకుంటుంది.దీని కారణంగా వర్కిట్ పర్మిట్ పూర్తయ్యాక వర్కర్స్ కు ఎలాంటి బకాయిల బెడద ఉండదు.వేరే యాజమాన్యం పనికి చేర్చుకోవాలన్న సరే...అంతకుముందు పనిచేసిన చోట ఆ వర్కర్ కు పూర్తి జీతం చెల్లించిన వివరాలు ఉండాల్సిందే. ఇలా కొత్తగా ప్రవేశ పెట్టిన వేలిముద్రల ప్రక్రియ కువైట్ లో ప్రవాస కార్మికులకు మేలు చేయనుంది.
తాజా వార్తలు
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!
- చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!