ఏషియాలో నంబర్ వన్ వర్క్ ప్లేస్ గా సౌదీకి చెందిన డీజీడీఏ సంస్థ
- September 06, 2022
సౌదీ: సౌదీకి దిరియా గేట్ డెవలప్‌మెంట్ అథారిటీ (DGDA) అరుదైన గౌరవం దక్కించుకుంది. అత్యుత్తమ పని ప్రదేశం కలిగిన సంస్థగా ఏషియాలోనే టాప్ లో నిలిచింది. మంచి పని వాతావారణం, అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే సంస్థలకు గ్లోబల్ అథారిటీ ఏటా ర్యాంక్ లు ఇస్తుంది. 2022 కు గానూ గ్రేట్ ప్లేస్ టు వర్క్ అంటూ దిరియా గేట్ డెవలప్‌మెంట్ అథారిటీ ని గ్లోబల్ అథారిటీ గుర్తించింది. మొత్తం 70 సంస్థలను సర్వే చేసిన తర్వాత ర్యాంక్ లు ప్రకటించారు. ఉద్యోగులకు మంచి పని వాతావారణం, వారికి జీత భత్యాలు, ప్రయోజనాలు, యాజమాన్యానికి ఉద్యోగులకు మధ్య ట్రస్ట్, రిలేషన్ షిప్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంక్ లను ప్రకటించారు. గ్లోబల్ అథారిటీ ర్యాంకుల్లో నంబర్ వన్ గా నిలవటంపై దిరియా గేట్ డెవలప్‌మెంట్ అథారిటీ సంతోషం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!
- చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!
- పాలస్తీనా గుర్తింపు శాశ్వత శాంతికి మార్గం: సయ్యద్ బదర్
- ఎయిర్పోర్ట్లో బాంబ్ హెచ్చరిక..అప్రమత్తమైన సిబ్బంది
- భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందా?
- ఆసియా కప్ ఫైనల్లో భారత్ vs పాకిస్థాన్..