ప్రముఖ రెస్టారెంట్ పై సామాజిక మీడియాలో పుకార్లు వ్యాప్తి చేస్తున్న వ్యక్తికి జైలుశిక్ష

- April 16, 2016 , by Maagulf
ప్రముఖ రెస్టారెంట్ పై  సామాజిక మీడియాలో పుకార్లు వ్యాప్తి చేస్తున్న వ్యక్తికి  జైలుశిక్ష

 రువి లో  ఒక ప్రముఖ రెస్టారెంట్ పై  సామాజిక మీడియాలో తప్పుడు  పుకార్లు వ్యాప్తి వ్యక్తిని అదుపులోనికి   తీసుకొని  జైలు శిక్ష విధించారు.ఈ కేసు వివరాలు ప్రకారం , ఒమన్ వినియోగించబడని ఒక జంతువు యొక్క మాంసం మృత కళేబరాన్ని చూపి ఆ రెస్టారెంట్లో ఆ మాంసాన్ని వినియోగదారులకు వడ్డిస్తిస్తున్న చిత్రాలను తాను పెట్టిన పోస్ట్ ద్వారా    అప్లోడ్ చేశాడు. అంతే కాక  ఆ రెస్టారెంట్ నిర్వాహకులను మస్కట్ మున్సిపాలిటీ శిక్షించినట్లు చేసినట్లు సైతం  ఆరోపించాదు ." ఈ రెస్టారెంట్ చాలా ప్రాచుర్యం పొందినది కావడంతో  ఆ  పోస్ట్ మమ్మల్ని ఎంతో ప్రభావితానికి గురి   చేసిందని నిర్వాహకుడు మస్కట్ డైలీకి తెలిపారు. " మా రెస్టారెంట్లో భోజనం చేసే వారి సంఖ్య బాగా పడిపోయింది వినియోగదారులలో  ఆందోళన మొదలయింది."" ఆ పోస్టు వలన మాకు జరిగిన పరువు నష్టం మాకు చాలా ఇబ్బంది కలగడానికి కారణమైంది మరియు మేము  పోస్ట్ వెనుక ఉన్న వ్యక్తిని  గుర్తించేందుకు  రాయల్ ఒమాన్ పోలీసులను  కలుసుకున్నట్లు  రెస్టారెంట్ యజమాని చెప్పారు."అయితే , ఇప్పుడు ఇప్పుడే పరిస్థుతులు సాధారణ స్థితికి  తిరిగి వస్తున్నాయి. మా కీర్తికి వ్యతిరేకంగా వ్యాపించిన పుకార్లకు కారణమైన వ్యక్తిని  మేము తేలికగా  తీసుకోమని మేనేజర్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com