బిగ్‌బాస్ తెలుగు 6: రొట్ట సింపథీ మొదలెట్టేశారుగా.!
- September 07, 2022
బుల్లితెరపై మెగా గేమ్ షోగా పేరు తెచ్చుకున్న ‘బిగ్‌బాస్’ తెలుగు ఆరో సీజన్ ఇటీవలే స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా గ్రాండ్‌గా ఈ షో స్టార్టయ్యింది. హౌస్ కూడా గతంలో కన్నా కలర్ ఫుల్‌గా తీర్చి దిద్దారు.
20 మంది కంటెస్టెంట్లతో స్టార్టయిన ఈ షోలో మొదటి రోజే గొడవలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అఫ్కోర్స్.! బిగ్‌బాస్ అంటేనే అంత కదా. అనవసరమైన గొడవలు, హద్దుల్లేని కాంట్రవర్సీలు.. ఇవే ఈ షోకి క్రేజ్ తెచ్చిపెట్టిన ఘట్టాలు.
ఆ ఫార్ములాతోనే ఫస్ట్ డేనే బాత్రూమ్ విషయమై గలాటీ గీతూ కంటెస్టెంట్లతో గొడవకు దిగింది. గీతూ ఆటిట్యూడ్‌ని తట్టుకోవడం కూసింత కష్టమే. హౌస్‌లో లేడీ అర్జున్ రెడ్డిలా అగుపిస్తోంది గీతూ రాయ్.
ఇక, ఇనయా సుల్తానా.. ఆర్జీవీ హీరోయిన్గా పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఈమె కూడాతక్కువేం తినలేదండోయ్.సింపథీ గెయిన్ చేస్తూనే అనవసరంగా వాదనలకు దిగుతోంది. జబర్దస్త్ నుంచి ఫైమా, చలాకి చంటీ ప్రస్తుతానికి తమ పరిధి మేరకు హౌస్‌లో పర్ఫామ్ చేస్తున్నారు. బాలాదిత్య, ఆర్జే సూర్య, శ్రీహాన్, సుదీప, అభినయశ్రీ తదితరులు ఓకే.
తెలియని ముఖాలు కావడంతో, ప్రేక్షకులకు ఈ సారి కంటెస్టెంట్లను గుర్తు పెట్టుకోవడం కూసింత టప్ టాస్కే. మరి, అందుకు కాస్త టైమ్ పడుతుందనుకోండి. ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్లో బాలాదిత్య, ఇనయా సుల్తానా, అభినయశ్రీ వున్నారు. చూడాలి మరి, ఫస్ట్ ఎలిమినేషన్ ఎఫెక్ట్ ఎవరికి పడుతుందో.!
తాజా వార్తలు
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!