‘శాకినీ ఢాకినీ’ ప్రమోషన్లు షురూ చేసిన ముద్దుగుమ్మలు.! డైరెక్టర్ లేకుండానే.!
- September 07, 2022
రెజీనా కసండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘శాకినీ ఢాకినీ’. ‘స్వామి రారా’ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాని తెరకెక్కించారు. త్వరలో రిలీజ్ కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్లు షురూ చేశారు.
అయితే, సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా అభివర్ణిస్తారు డైరెక్టర్ని. అలాంటిది ఈ సినిమా ప్రమోషన్లు డైరెక్టర్ లేకుండానే స్టార్ట్ అయిపోయాయ్. హీరోయిన్లు రెజీనా, నివేదా థామస్ తమ స్టైల్లో సినిమాని తెగ ప్రమోట్ చేసేస్తున్నారు.
డైరెక్టర్ సుధీర్ వర్మ ఎందుకు ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా వున్నాడు.? ఈ విషయంలో ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. నిర్మాతలకీ, డైరెక్టర్‌కీ మధ్య కథ విషయంలో గిల్లి కజ్జాలు మొదలయ్యాయట. దాంతో, ఎలాగోలా సినిమాని పూర్తి చేసి పక్కన పడేసి, డైరెక్టర్ తప్పుకున్నాడనీ ప్రచారం జరుగుతోంది.
‘మిడ్నైట్ రన్నర్స్’ అనే ఓ కొరియన్ సినిమాకి రీమేక్‌గా రూపొందింది ఈ సినిమా. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా డైరెక్టర్ తన విజన్‌తో కొన్ని మార్పులు చేయాలనుకున్నాడట కథలో. కానీ, నిర్మాతల్లో ఒకరైన తాటి సునీత అందుకు అంగీకరించలేదట. కొరియన్ సినిమాని ఎలా వున్నదాన్ని అలాగే తెరకెక్కించాలని పట్టుబట్టారట. క్రియేటివ్ థింకింగ్స్ వున్న సుధీర్ వర్మ అందుకు అంగీకరించకపోయేసరికి, కొన్ని సీన్లు వేరే డైరెక్టర్‌తో రీ షూట్ చేయించుకున్నారట.
దాంతో, ఈ సినిమాని సుధీర్ వర్మ పూర్తిగా లైట్ తీసుకున్నారట. రవితేజతో ప్రస్తుతం సుధీర్ వర్మ ‘రావణాసుర’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లను పట్టించుకోకుండా, ఆ సినిమా షూటింగ్లో బిజీ అయిపోయారట. అన్నట్లు ఈ సినిమాకి సురేష్ బాబు కూడా నిర్మాణ భాగస్వామ్యం వహిస్తున్నారు. తన సినిమా విషయంలో ఇంత గలాటా జరుగుతుంటే ఆయన ఎందుకు కామ్‌గా వూరుకున్నట్లో.!
తాజా వార్తలు
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!