సెక్స్ ట్రాఫికింగ్ కేసులో ముగ్గురు మహిళలకు పదేళ్ల జైలుశిక్ష
- September 08, 2022
బహ్రెయిన్: ఓ మహిళను అక్రమ రవాణా చేసి వ్యభిచారంలోకి దింపినందుకు ముగ్గురు ఆసియా మహిళలకు హైకోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలి స్వగ్రామానికి వెళ్లేందుకు అయ్యే ఖర్చులను కూడా వారే భరించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. బాధితురాలు తన స్వగ్రామంలోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తుండగా.. ఆమెకు మంచి జీతం(BD1,200) ఇస్తామని, బహ్రెయిన్‌లోని పెద్ద రెస్టారెంట్‌లో పనిచేసే అవకాశం కల్పిస్తానని నిందితుల్లో ఓ మహిళ ప్రలోభపెట్టింది. బాధితురాలు బహ్రెయిన్ రాజ్యానికి వచ్చిన తర్వాత ఆమెను బలవంతంగా వ్యభిచార రంగంలోకి దింపారు. అనంతరం మొదటి నిందితుడు బాధితురాలిని రెండవ నిందితుడికి BD500కి విక్రయించాడు. అనంతరం మూడో నిందితుడికి అమ్మడంతో.. అతడు తన నిర్వహణలోని హోటల్‌కు పంపాడు. ఒక కస్టమర్ సాయంతో ఆమె తన దేశ రాయబార కార్యాలయాన్ని సంప్రదించడంతో విషయం బయటికొచ్చింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ముగ్గురి జైలు శిక్ష పూర్తయిన తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!