బాలుడిపై లైంగిక దాడి. వ్యక్తికి ఐదేళ్ల జైలుశిక్ష
- September 08, 2022
దమ్మం: 16 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించినందుకు 30 ఏళ్ల వ్యక్తికి అల్-ఖోబర్ క్రిమినల్ కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. బాధిత బాలుడు తనకు తెలియదని, తనపై తప్పుడు ఆరోపణలు చేశారని నిందితుడు చెసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. లా ఆఫ్ ఎవిడెన్స్ ప్రకారం.. బాధితుడిపై వేధింపులకు పాల్పడుతున్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు కోర్టుకు సమర్పించారు. డిజిటల్ సాక్ష్యంగా కోర్టు వీటిని పరిగణనలోకి తీసుకుంది. వేధింపుల నిరోధక చట్టం ప్రకారం.. నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. దీంతోపాటు నిందితుడు తన స్వంత ఖర్చుతో రెండు స్థానిక వార్తాపత్రికలలో తీర్పును ప్రచురించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం