ఫుట్ బాల్ అభిమానులకు ఒమన్ గుడ్ న్యూస్
- September 08, 2022
మస్కట్: ఫుట్ బాల్ అభిమానులకు ఒమన్ గుడ్ న్యూస్ చెప్పింది. FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 కోసం ఉచిత మల్టీ ఎంట్రీ కలిగించే 60-రోజుల వీసాలను అందజేయనున్నట్లు ఒమన్ పర్యాటక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫుట్‌బాల్ ఫ్యాన్ వీసాతో పాటు మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఫాస్ట్ లేన్లు, ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో 9,000 చదరపు మీటర్ల ప్రపంచ కప్ ఫెస్టివల్ విలేజ్ తోపాటు ఒమన్ అంతటా ఇతర అనేక కార్యకమాలను నిర్వహించనున్నట్లు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ పాస్పోర్ట్స్ అండ్ సివిల్ స్టేటస్‌లో అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ అఫైర్స్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అహ్మద్ బిన్ సయీద్ అల్ ఘఫ్రీ, తెలిపారు. హయ్యా కార్డ్ హోల్డర్లు ఒమన్‌లో ఫస్ట్-డిగ్రీ బంధువులతో కలిసి ఉండవచ్చన్నారు. సుల్తానేట్‌లో ఉన్నప్పుడు వీసాను మరొక వర్గానికి పేర కూడా మార్చవచ్చాన్నారు. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఫిఫా ఫుట్ బాల్ అభిమానుల కోసం ప్రత్యేక ఫాస్ట్ లేన్లు, ఎయిర్ పోర్ట్ బయట ప్రత్యేక బస్ స్టాప్ లు ఏర్పాటు చేసినట్లు ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ ఆపరేషన్స్ చీఫ్ సౌద్ బిన్ నాసర్ అల్ హుబైషి తెలిపారు. ఫుట్ బాల్ అభిమానుల కోసం 20,000 హోటల్స్ గదులు, 200 కుపైగా టూరిజం ఆఫర్లను అందిస్తున్నాయని విజిట్ ఒమన్ డైరెక్టర్ జనరల్ షబీబ్ అల్ మమారి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 52 విమానయాన సంస్థలు సుల్తానేట్కు విమానాలను నడుపుతాయన్నారు.
తాజా వార్తలు
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం