వర్షాలతో యూఏఈలో తగ్గిన ఉష్ణోగ్రతలు
- September 08, 2022
యూఏఈ: వేసవి జల్లులు యూఏఈని పలకరించాయి. ఎమిరేట్ లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వర్షాలు కురిశాయి. అల్ ఫోహ్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసినట్లు జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. అయితే అల్ ఐన్‌లోని ఖత్మ్ అల్ షిక్లా, అల్ రీఫ్లో చిరుజల్లులు పడ్డాయని పేర్కొంది. వర్షాలకు సంబంధించిన అనేక వీడియోలను వాతావరణ కేంద్రం తన సోషల్ మీడియా హ్యాండిల్ లో షేర్ చేసింది. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదల చోటుచేసుకుంది. ఔటైద్ (అల్ దఫ్రా ప్రాంతం) లో 45.6°C నమోదైంది. వర్షాలు కురిసే సమయాల్లో రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాహనదారులను NCM హెచ్చరించింది.
తాజా వార్తలు
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!