సమంత మరో సంచలనం: అదరహో అనిపించే యాక్షన్ థ్రిల్లర్‌గా ‘యశోద’.!
- September 08, 2022
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం విభిన్న తరహా కథలను ఎంచుకుంటూ ఓ డిఫరెంట్ పంథాలో ముందుకు సాగిపోతోంది. ఆ కోవకు చెందిందే ఆమె నటిస్తున్న ‘యశోద’ చిత్రం. ఇదో థ్రిల్లర్ మూవీ అని ఇంతకు ముందే తెలుసు. కానీ, ఈ సినిమాలోని సమంత యాక్షన్ సన్నివేశాలకు షాక్ అవ్వాల్సిందే అని తాజాగా మేకర్లు ప్రూవ్ చేయబోతున్నారు.
రేపు అనగా సెప్టెంబర్ 9 వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కాబోతోంది. టీజర్ అంటే టీజర్ కాదు. సినిమాపై భారీగా అంచనాలు క్రియేట్ అయ్యేలా ఈ టీజర్ వుండబోతోందట. సమంత చేసే యాక్షన్ స్టంట్లకు సంబంధించి ఈ టీజర్లో షాకింగ్ శాంపిల్స్ రివీల్ చేయబోతున్నారనీ తెలుస్తోంది.
హిందీ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్ 2’ కోసం ఆల్రెడీ సమంతను యాక్షన్ గాళ్‌గా చూసేశాం. ఈ వెబ్ సిరీస్‌లోనే మ్యాగ్జిమమ్ యాక్షన్ ట్రిక్స్ చూపించేసింది సమంత. సమంతలో ఇంత గొప్ప యాక్షన్ గాళ్ దాగుందా.? అనిపించేంతలా వుంటాయ్ ఆ సిరీస్‌లోని యాక్షన్ సీన్స్.
ఇక, ఇప్పుడు ‘యశోద’ కోసం అంతకు మించి కష్టపడిందట సమంత. ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రఫర్ యాన్నిక్ బెన్ ఈ సినిమాలో యాక్షన్ సీన్లు కంపోజ్ చేశారట. ఆగస్ట్‌లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ వుండిపోవడంతో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేకపోతున్నామని తాజాగా మేకర్లు ప్రకటించారు. ఇక, రిలీజ్‌కి ముందే టీజర్‌పై అంచనాలు పెంచేశారు మేకర్లు. ఆ అంచనాల్ని టీజర్ అందుకుంటుందా లేదా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!
- బీచ్‌లో స్టంట్స్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో ఇల్లీగల్ ప్రయాణీకుల రవాణాపై కఠిన చర్యలు..!!
- పిల్లిని చంపిన వ్యక్తి వీడియో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం..!!
- ఇండియన్ క్లబ్ ‘ఆవాణి’ ఓనం ఫియస్టా..!!
- కువైట్ లో ఉత్సాహంగా వికసిత్ భారత్ రన్ ..!!
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ