నివేదా థామస్..! ఏంటీ ఇది నువ్వేనా.! ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.!
- September 08, 2022
‘జెంటిల్మెన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన క్యూట్ బ్యూటీ నివేదా థామస్. మంచి నటి. టాలెంటెడ్ యాక్ట్రస్. కానీ, కొద్దిగా ఆటిట్యూడ్ చూపిస్తుంటుంది. సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటుంది. కథకూ, తన పాత్రకు ప్రాధాన్యత వుంటేనే ఆ సినిమాలకు సైన్ చేస్తుంది.
రీసెంట్గా పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’లో సినిమాలో పల్లవి పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది నివేదా థామస్. తాజాగా ‘శాకినీ ఢాకినీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
రెజీనా కసండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్లు షురూ చేశారు చిత్ర యూనిట్. అందులో భాగంగానే సోషల్ మీడియాలో తమ్ముడితో కలిసి నివేదా థామస్ ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌కు స్టెప్పులేసింది.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. వైరల్ సంగతి అటుంచితే, ఈ వీడియోలో నివేదా థామస్ ఫిజిక్ ఇప్పుడు హాట్ హాట్‌గా చర్చకొచ్చింది. అసలే కాస్త బొద్దుగా కనిపించే నివేదా థామస్, ఈ వీడియోలో ఓవర్ డోస్ వెయిట్‌తో కనిపిస్తోంది. ఇంత లావెక్కేశావేంటీ. నిజంగా ఇది నువ్వేనా.. అంటూ నివేదా థామస్‌ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
సినిమాలో ఎలా వుందో ఏమో కానీ, ఈ వీడియోలో చాలా చాలా లావుగా కనిపిస్తోంది నివేదా థామస్. తట్టుకోవడం కష్టమే అంటూ నివేదాని చూసి నెటిజన్లు వాపోతున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!
- బీచ్‌లో స్టంట్స్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో ఇల్లీగల్ ప్రయాణీకుల రవాణాపై కఠిన చర్యలు..!!
- పిల్లిని చంపిన వ్యక్తి వీడియో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం..!!
- ఇండియన్ క్లబ్ ‘ఆవాణి’ ఓనం ఫియస్టా..!!
- కువైట్ లో ఉత్సాహంగా వికసిత్ భారత్ రన్ ..!!
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం