ప్రవాసులకు అందించే సేవలకు సర్వీస్ ఛార్జీల పై సమీక్ష
- September 08, 2022
కువైట్: కువైట్ ప్రభుత్వం అందించే సేవలకు వసూలు చేస్తున్న ఛార్జీలపై సమీక్ష జరపనుంది. ప్రస్తుతం కువైట్ వాసులకు, ప్రవాసులకు అందరికీ ఓకే విధంగా సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఐతే ఈ ఛార్జీలను కువైట్ వాసులకు ఒక విధంగా ప్రవాసులకు మరో విధంగా ఉండేలా మార్పులు చేయనున్నారు. కువైట్ లో ఉన్న జనాభాలో 39 శాతం మాత్రమే స్థానికులు ఉన్నారు. మిగతా వారంతా విదేశాల నుంచి వచ్చిన వారే. వీరందరికీ ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అందించే సేవలకు ఒకే విధంగా ఛార్జీలు వసూలు చేస్తోెంది. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రవాసులకు అందించే సేవలకు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయాలని చాలా మంది కోరుతున్నారు. దీంతో ఈ మొత్తం సర్వీసు ఛార్జీల విషయంలో కువైట్ ప్రభుత్వం రివ్యూ చేయాలని నిర్ణయించింది. త్వరలో కొత్త సర్వీస్ ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!