క్రెడిట్ కార్డ్స్ పేమెంట్స్ పై అదనపు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు
- September 08, 2022
యూఏఈ: క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తున్న కస్టమర్లను వ్యాపారులు దోచుకుంటున్నారు. క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసిన వారిపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ అదనపు బాదుడు భారీగా పెరిగింది. దీంతో కస్టమర్ల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో గవర్నమెంట్ రియాక్ట్ అయ్యింది. ఇలా అదనంగా ఛార్జీలు వసూలు చేయటం కచ్చితంగా నేరమేనని అజ్మాన్స్ డిపాార్ట్ మెంట్ స్పష్టం చేసింది. అదనంగా ఛార్జీలు చెల్లించిన కస్టమర్లు వినియోగదారుల ఫోరమ్ లో కంప్లైంట్ చేసి తమ చెల్లించిన రుసుమును తిరిగి పొందవచ్చని తెలిపింది. క్రెడిట్ కార్డు పేమెంట్స్ అదనపు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని వ్యాపారులను ప్రభుత్వం హెచ్చరించింది. అటు కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో ఈ ఏడాది కొత్త వ్యాపార లైసెన్సులు పెరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది మొదటి ఆరు నెలల కాలంతో పోలిస్తే ఈ ఏడాది 2,637 కొత్త లైెసెన్స్ లు ఇచ్చినట్లు తెలిపింది. ఇది పోయిన ఏడాదితో పోల్చితే 16 శాతం అధికం.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!