ఒమన్, సౌదీ ల మధ్య సముద్ర తీర రవాణా ఒప్పందం

- September 08, 2022 , by Maagulf
ఒమన్, సౌదీ ల మధ్య సముద్ర తీర రవాణా ఒప్పందం

మస్కట్: ఒమన్, సౌదీ రెండు దేశాలు సముద్ర తీర రవాణా విషయంలో కొత్తగా ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య సీ ట్రాన్స్ పోర్ట్ మరింత సులభతరం కానుంది. మస్కట్ లో జరిగిన సమావేశంలో ఇరు దేశాల రవాణా శాఖ మంత్రులు ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఒక దేశం జలాల్లోకి మరొక దేశం నౌకలు ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రయాణం చేస్తాయి. నౌక కెప్టెన్లకు సంబంధించిన వివరాలు, వారి సర్టిఫికెట్స్ కు సంబంధించిన సమాచారాన్ని రెండు దేశాలు ఇచ్చి పుచ్చుకోనున్నాయి. ఈ ఒప్పందం ద్వారా సౌదీ, ఒమన్ మధ్య తీర ప్రాంత రవాణా మరింత పెరగనుంది. దీంతో రెండు దేశాలకు రవాణా ఖర్చు భారీగా తగ్గనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com