తెలంగాణ కరోనా అప్డేట్
- September 09, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతుండటం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 11వేల 398 మందికి కరోనా పరీక్షలు చేయగా, 128 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 54 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6 కేసులు, కరీంనగర్ జిల్లాలో 6 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 177 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసులకంటే కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటం రిలీఫ్ ఇచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 35వేల 747 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 30వేల 703 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 933కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 11వేల 127 మందికి కరోనా పరీక్షలు చేయగా, 130 మందికి పాజిటివ్ గా తేలింది.
తాజా వార్తలు
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్
- ఎయిర్ బస్కి ఏపీ నుంచి ఆహ్వానం...
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!