త్వరలో ప్రవాసులకు ఆరోగ్య సేవల ఫీ పెంపు..!
- September 10, 2022
కువైట్: ప్రవాసుల కోసం ఆరోగ్య సేవా రుసుములను పెంచే ప్రణాళికను ఆరోగ్య మంత్రిత్వ శాఖ త్వరలో ప్రారంభించనుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రణాళికను మూడు వర్గాలుగా విభజించారు. మొదటి వర్గం వ్యక్తులలో ప్రైవేట్ రంగంలోని కార్మికులు, ఫ్యామిలీ రెసిడెన్సీ పర్మిట్ హోల్డర్లు ఉన్నారు. ఈ వర్గానికి సంవత్సరానికి 130 దినార్‌ల వరకు ఖర్చయ్యే ఆరోగ్య బీమాను ఉపయోగించి 'డామన్ హాస్పిటల్స్' ద్వారా ఆరోగ్య సేవ అందించబడుతుంది. ఈ రుసుముల్లో రోగుల పరీక్షలు, ఎక్స్-రేలు, చికిత్సలు కవర్ అవుతాయి. రెండవ వర్గంలో ప్రభుత్వ రంగం, ప్రభుత్వ క్లినిక్‌లు, ఆసుపత్రులలో పని చేస్తున్న ప్రవాసులు ఉన్నారు. వీరు పనిచేసే ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా బీమా కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడో కేటగిరీలో టూరిస్టులు ఉన్నారు. కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని రూపొందించారు. గృహ కార్మికులు ప్రస్తుత బీమా ప్యాకేజీ కింద లేదా స్వల్ప పెరుగుదలతో ప్రభుత్వ సౌకర్యాలలో సేవలను పొందవచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- బహ్రెయిన్‌లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో 3.2శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు..!!
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెంపు..!!
- క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ను నిషేధించిన అబుదాబి..!!
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్