తుపాకీతో దోపిడిలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

- September 10, 2022 , by Maagulf
తుపాకీతో దోపిడిలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

సౌదీ: రియాద్‌లో బ్యాంకు ఖాతాదారులను తుపాకీతో బెదిరించి దోచుకుంటున్న ప్రవాసుల ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అరెస్టయిన వ్యక్తులు ఇథియోపియన్, సిరియన్, బంగ్లాదేశ్ లకు చెందిన వారని తెలిపింది. ఆఫ్రికా దేశాలకు చెందిన నిందితులు సరిహద్దులను అక్రమంగా దాటి దేశంలోకి చొరబడినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిందితులు తుపాకీలతో బ్యాంక్ ఖాతాదారులను  బెదిరించి దోచుకున్నారని మంత్రిత్వ శాఖా పేర్కొంది. ఇథియోపియన్, సిరియన్ దేశాలకు చెందిన నలుగురు వ్యక్తులను.. ఇద్దరు బంగ్లాదేశ్ నివాసితులకు ఆశ్రయం కల్పించి, వారికి సిమ్ కార్డులు అందించిన వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారని మంత్రిత్వ శాఖ తెలిపింది. అరెస్టయిన వ్యక్తుల నుంచి దొంగిలించిన నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతోపాటు నిందితుల నుండి 387 సిమ్ కార్డులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు, పోలీసులు వారిపై ప్రాథమిక చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com