కార్మికుల బహిష్కరణ వార్తలను ఖండించిన యూఏఈ
- September 10, 2022
యూఏఈ: ఆఫ్రికన్ దేశాలకు చెందిన కొంతమంది కార్మికులను బహిష్కరించడంపై మీడియా రిపోర్టింగ్లకు సంబంధించిన ఆరోపణలు అవాస్తవమని యూఏఈ విదేశాంగ, అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖలోని మానవ హక్కుల విభాగం డైరెక్టర్ సయీద్ అల్ హెబ్సీ ఖండించారు. మీడియాలో చూపుతున్న నివేదికలు పాతవని పేర్కొన్నారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫర్ హ్యూమన్ రైట్స్ పాలసీస్ ప్రచురించిన నివేదికను మీడియాలో తప్పుగా చూపుతున్నారన్నారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గతంలో 2021లో ప్రచురించిన నివేదికలను మీడియాలో చూపుతున్నారని అల్ హెబ్సీ అన్నారు. వివిధ ఉల్లంఘనల్లో అరెస్టయిన కార్మికులపై చట్టపరమైన విధానాలలో దేశ బహిష్కరణ జరిగిందని, ఇదంతా సాధారణ ప్రక్రియలో భాగమని అల్ హెబ్సీ పేర్కొన్నారు. కార్మిక విధానాల్లో యూఏఈ పూర్తి పారదర్శకతకు కట్టుబడి ఉందని, ఈ విషయంలో సంబంధిత అధికారుల అధికారిక ప్రకటనలను ప్రస్తావించాలని మీడియాను అల్ హెబ్సీ కోరారు.
తాజా వార్తలు
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- బహ్రెయిన్‌లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో 3.2శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు..!!
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెంపు..!!
- క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ను నిషేధించిన అబుదాబి..!!
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ