గ్లోబల్ నాలెడ్జ్ ఇండెక్స్‌. 4వ స్థానంలో నిలిచిన బహ్రెయిన్

- September 10, 2022 , by Maagulf
గ్లోబల్ నాలెడ్జ్ ఇండెక్స్‌. 4వ స్థానంలో నిలిచిన బహ్రెయిన్

బహ్రెయిన్ : గ్లోబల్ నాలెడ్జ్ ఇండెక్స్ (GKI)లో బహ్రెయిన్ ప్రపంచవ్యాప్తంగా 4వ ర్యాంక్‌ను పొందింది. నాలెడ్జ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా బలమైన పనితీరుగా పేర్కొనే "ఉన్నత విద్యలో పరిశోధకుల" విభాగంలో ఇది రావడం విశేషం. GKIల గ్లోబల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ర్యాంకింగ్స్‌లో కూడా బహ్రెయిన్ ఉన్నత స్థానంలో ఉంది. కింగ్‌డమ్ 3G/4G నెట్‌వర్క్ కవరేజ్, ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న గృహాలు, ప్రతి సబ్‌స్క్రిప్షన్‌కు మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ట్రాఫిక్, ఇంటర్నెట్ వినియోగదారులలో అత్యుత్తమ రేటింగ్‌ల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. విద్యాపరమైన స్వేచ్ఛ, పునరుత్పాదక ఇంధన వినియోగం, వ్యాపార సంస్థలలో పరిశోధకులు, తలసరి పర్యావరణ పాదముద్ర, వృత్తి విద్యలో నమోదు, లింగ సమానత్వంతో సహా కొన్ని అభివృద్ధి రంగాలలో బహ్రెయిన్‌ గణనీయమైన వృద్ధి నమోదైనట్లు నివేదిక వివరించింది. మొత్తంమీద బహ్రెయిన్ 154 దేశాలలో 55వ స్థానంలో ఉండగా.. అత్యధిక మానవాభివృద్ధిని కలిగి ఉన్న 61 దేశాలలో 51వ స్థానంలో ఉంది.

UAE, సౌదీ

GCC దేశాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 11వ స్థానంలో ఉండగా... నాలెడ్జ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా యూఏఈ అగ్రగామిగా ఉంది. పొరుగున ఉన్న సౌదీ అరేబియా 40వ స్థానం(57.6 స్కోరు)లో ఉంది. కువైట్ 48వ ర్యాంకులో, ఒమన్ 52, ఖతార్ 38వ ర్యాంక్‌లో నిలిచాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com