భారత్ కరోనా అప్డేట్
- September 10, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో గత 24 గంటల్లో నిర్వహించిన 3,76,855 టెస్టుల్లో కొత్తగా 5,554 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 48,850 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 6,322 మంది వైరస్ నుంచి కోలుకోగా.. కొత్తగా 16 మంది మరణించారు.దేశంలో ఇప్పటిదాకా నమోదైన కరోనా కేసులు 4,44,90,283కి చేరుకున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,39,13,294కి చేరుకుంది. వైరస్ వల్ల దేశంలో ఇప్పటివరకు 5,28,139 మంది మృతిచెందారు.
ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 1.47 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. క్రియాశీల రేటు కూడా 0.11 శాతానికి తగ్గిందని తెలిపింది. రివకరీ రేటు 98.70 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. దేశ వ్యాప్త కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటిదాకా 214.77 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







