ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీని ప్రారంభించిన ఏపీ డిజిపి
- September 10, 2022
విజయవాడ: ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీస్,సైకియాట్రిక్ సొసైటి ఆద్వర్యంలో బెంజిసర్కిల్ నుండి ఇందిరా గాంధి స్టేడియం వరుకు నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన ఏపీ డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి.
కుటుంబ కలహాలతోనే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కేవీ.రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.జాతీయ నేర గణాంక సంస్థ ప్రకటించిన 2021 గణాంకాల్లో ఇదే విషయమై స్పష్టమైందన్నారు.పోలీసు శాఖ, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినం పురస్కరించుకొని నిర్వహించిన ప్రదర్శనలో డీజీపీ పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా బెంజిసర్కిల్ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు విద్యార్థులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. చదువుల విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ఒత్తిడి తీసుకురావొద్దని డీజీపీ సూచించారు.ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు... అనారోగ్య సమస్యలతో మరికొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా, అధికారులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, మానసిక చికిత్స వైద్య నిపుణులు ప్రదర్శనలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!