సైనిక స్టేషన్‌తో పాటు రహదారికి దివంగత బిపిన్ రావత్ పేరు..!
- September 10, 2022
ఈటానగర్: ఇండియన్ ఆర్మీ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, దిగవంత జనరల్ బిపిన్ రావత్ స్మారకార్థం అరుణాచల్‌ప్రదేశ్‌లోని కిబితులోని సైనిక స్టేషన్‌తో పాటు రహదారికి ఆయన పేరును పెట్టారు. చైనాతో ఉన్న వాస్తవ నియంత్రణ రేఖ (LAC)లోని లోహిత్ వ్యాలీలో ఉన్న ఈ సైనిక స్టేషన్‌ను ఇకపై జనరల్ బిపిన్ రావత్ స్టేషన్‌గా పిలువనున్నారు. అలాగే గ్రామ ప్రధాన రహదారికి సైతం ఆయన పేరును పెట్టారు. గతేడాది డిసెంబర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
కాగా, కల్నల్‌గా రావత్ 1999 నుంచి 2000 వరకు కితిబులోని బెలాలియన్ 5/11 గూర్ఖా రైఫిల్స్‌కు నాయకత్వం వహించారు. శనివారం జరిగిన కార్యక్రమంలో కిబితు గ్రామ ప్రధాన రహదారికి అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ బీడీ మిశ్రా, ముఖ్యమంత్రి పెమా ఖండూ, తూర్పు ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రాణా ప్రతాప్ కలిత పేరు పెట్టారు. రావత్ కుమార్తెలు కృతిక, తారిణితో పాటు పలువురు సీనియర్ అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే కిబితు మిలిటరీ క్యాంప్ పేరు జనరల్ బిపిన్ రావత్ మిలిటరీ గారిసన్‌గా మార్చారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!