కువైట్ లో త్వరలోనే భారీగా ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ స్టేషన్లు
- September 10, 2022
కువైట్: కువైట్ లో త్వరలోనే భారీగా ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రభుత్వం సిద్ధం చేసిందని రెన్యువబుల్ ఎనర్జీ మినిస్టర్ అల్ మౌసా తెలిపారు. కువైట్ వాతావారణ పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడెక్కడ ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న రోడ్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు.గత కొంతకాలంగా దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉందని ఆయన చెప్పారు. రెన్యువబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ కార్ల రంగానికి మద్దతుగా నిలుస్తోంది. త్వరలోనే ప్రభుత్వ బిల్డింగ్ లు, కమర్షియల్ ఏరియాల్లో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థలు దేశంలో తమ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ లను నెలకొల్పే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అల్ మౌసా చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







