ఫ్లోర్ మిల్స్ ద్వారా బడి పిల్లలకు భోజనం-కువైట్ విద్యాశాఖ
- September 10, 2022
కువైట్: కువైట్ లో బడి పిల్లలకు భోజనం అందించే ప్రాజెక్ట్ ను మళ్లీ ఈ ఏడాది నుంచి ప్రారంభించనున్నారు. కువైట్ లో 6 ఏళ్ల లోపు బడి పిల్లలకు ప్రభుత్వమే పౌష్టికాహారం, భోజనం అందిస్తుంది. ఐతే కరోనా కారణంగా రెండేళ్ల పాటు పిల్లలకు భోజనం అందించటాన్ని నిలిపివేశారు. ఈ ఏడాది మళ్లీ పిల్లలకు భోజనం అందించే ప్రాజెక్ట్ ను పునరుద్ధరిస్తున్నట్లు కువైట్ విద్యాశాఖ తెలిపింది. కువైట్ లోని పిండి మిల్లులలో పిల్లలకు తాత్కాలికంగా భోజనం సిద్ధం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఫ్లోర్ మిల్స్ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. కొన్ని నెలల పాటు ఫ్లోర్ మిల్స్ లలో పిల్లల కోసం భోజనం సిద్ధం చేయించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. పరిస్థితులన్నీ పూర్తిగా చక్కబడిన తర్వాత పిల్లల కోసం భోజనం సిద్ధం చేసేందుకు స్వంతంగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!