రెబెల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత

- September 11, 2022 , by Maagulf
రెబెల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత

హైదరాబాద్: చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, నిర్మాత, రెబల్ స్టార్ కృష్ణంరాజు (83) కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న ఈయన ఈరోజు ఆదివారం ఉదయం 3.25 నిమిషాలకు తుదిశ్వస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. 187 చిత్రాల్లో నటించారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో హీరోగా తెలుుగ చిత్రసీమలోకి అడుగు పెట్టారు. ఇండస్ట్రీలో రెబెల్ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్న కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు.

హీరోగా సినీ రంగ ప్రవేశం చేసి విలన్‌గానూ అలరించారు. కృష్ణంరాజు కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్‌ను ఏలారు. ఆయన మృతిలో టాలీవుడ్‌ షాక్‌కు గురైంది. సోమవారం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన మృతితో సినీ పరిశ్రమ శోకసముద్రంలో మునిగిపోయింది. ఇక చిత్రసీమలోనే కాదు రాజకీయాల్లోనూ రాణించారు. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన కృష్ణంరాజు వాజ్‌పేయ్‌ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అలాగే 2004లో లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందిన కృష్ణంరాజు .. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అమరదీపం, ధర్మాత్ముడు, బొబ్బిలి బ్రహ్మాన్న, తాండ్ర పాపారాయుడు వంటి చిత్రాల్లో కృష్ణంరాజు నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి. 2006లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డు వచ్చింది. అలాగే అమరదీపం, మనవూరి పాండవులు చిత్రాలకు రాష్ట్రపతి అవార్డులు కూడా వచ్చాయి. ఆయన నటించిన ఆఖరి చిత్రం ‘రాధే శ్యామ్’.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com