ఖతార్ లో తగ్గిన హోమ్ డెలివరీ ఛార్జీలు
- September 11, 2022
దోహా: మందులు, వైద్య నివేదికలు, వైద్య వినియోగ వస్తువులు, ఆహార ఉత్పత్తుల హోమ్ డెలివరీ ఛార్జీలు QR30 నుండి QR20కి తగ్గాయి. ఈ మేరకు ఖతార్ పోస్ట్, హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC), ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC), మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (MOPH) సంయుక్తంగా ప్రకటించాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 2020లో హోమ్ డెలివరీ సర్వీసును ప్రారంభించారు. దీనికి రోగుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకు 400,000 కంటే ఎక్కువ మందుల డెలివరీలను HMC చేసింది. అలాగే దాదాపు 200,000 మందుల డెలివరీలు PHCC చేసింది. తాజాగా తగ్గించిన డెలివరీ ఛార్జీలు ఈ సంవత్సరం చివరి వరకు అమలులో ఉండనున్నాయని హెచ్ఎంసి ఫార్మసీ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మోజా అల్ హైల్ తెలిపారు. FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 సమయంలో కమ్యూనిటీకి ఈ సర్వీసు మరింత చేరువ అవుతుందని, PHCC ఆరోగ్య కేంద్రాల ఫార్మసీలను సందర్శించే రోగుల సంఖ్యను తగ్గించడానికి ఇది తోడ్పడుతుందని, COVID-19 వైరస్ వ్యాప్తిని మరింత నిరోధిస్తుందని ఆయన వివరించారు. ఖతార్ పోస్ట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఫలేహ్ అల్ నేమీ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో రోగులకు మరింత చేరువ అవుతామన్నారు. PHCC మందుల హోమ్ డెలివరీ సర్వీసు కోసం వారి ఆరోగ్య కేంద్రం కేటాయించిన మందుల హోమ్ డెలివరీ సర్వీస్ నంబర్‌కు లేదా మరింత సమాచారం కోసం 16000కి కాల్ చేయవచ్చన్నారు. అలాగే రోగులు తమ ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన వాట్సాప్ నంబర్‌కు కూడా మెసేజ్ కూడా పంపవచ్చన్నారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!