కాలిన గాయాలకు టూత్‌పేస్ట్ వినియోగంపై జీసీసీ నిషేధం
- September 11, 2022
మస్కట్: మొదటి-డిగ్రీ కాలిన గాయాలపై టూత్‌పేస్ట్‌ను ఉపయోగించడాన్ని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) హెల్త్ కౌన్సిల్ ఆఫ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ నిషేధించింది. టూత్‌పేస్ట్‌లో కాలిన గాయాలకు కారణమయ్యే రసాయనాలు ఉన్నాయని కౌన్సిల్ పేర్కొంది. టూత్‌పేస్ట్ మొదటగా గాయాలపై పెట్టగానే చల్లటి అనుభూతిని ఇస్తుందని తెలిపింది. అలాగే కాలిన గాయాలపై ఆలివ్ నూనె, వెన్నను పూయడం మానుకోవాలని కౌన్సిల్ స్పష్టం చేసింది. ఈ పదార్థాలు కాలిన గాయాలలో వేడిని నిలుపుదల చేస్తాయని తెలిపింది. కాలిన గాయాలకు చికిత్స చేయడానికి క్రీమ్‌లు, ఆయింట్మెంట్లను ఉపయోగించడంతో పాటు కాలిన ప్రాంతాన్ని గోరువెచ్చని నీటిలో 10 నుండి 20 నిమిషాల పాటు ఉంచాలని, నొప్పి తీవ్రంగా ఉంటే అనేక దశలను అనుసరించడం ద్వారా గాయాలను తగ్గించుకోవాలని GCC హెల్త్ కౌన్సిల్ వెల్లడించింది. నొప్పి నివారణ మందులు తీసుకోవడం, నొప్పి అలాగే ఉంటే వైద్య సలహా తీసుకోవడం చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!
- నవంబర్ లో ఫ్లైట్స్ రేట్స్ డ్రాప్..!!
- పాఠశాల క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీపై ఖతార్ వార్నింగ్..!!
- మానవ అక్రమ రవాణాపై కువైట్ ఉక్కుపాదం..!!
- ఇజ్రాయెల్ నిర్బంధించిన పౌరులపై బహ్రెయిన్ ఆరా..!!
- హైల్ మసాజ్ పార్లర్లో అనైతిక చర్యలు..!!
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు