24 గంటల వ్యవధిలో మూడు మృతదేహాలు లభ్యం
- September 11, 2022
కువైట్ సిటీ: అనుమానాస్పద పరిస్థితుల్లో 24 గంటల వ్యవధిలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. అల్-దబయ్యా తీరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. అంతకుముందు ఫహాహీల్‌లోని బహిరంగ ప్రదేశంలో పార్క్ చేసిన కారులో గుర్తుతెలియని వ్యక్తి శవాన్ని గుర్తించామన్నారు. అలాగే అల్-ఖైరాన్ శివారులోని వాహనంలో మరో గుర్తు తెలియని యువతి శవం కనిపించిందని పోలీసులు వెల్లడించారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు భద్రతాధికారులు తెలిపారు. మరో సంఘటనలో సెవెంత్ రింగ్ రోడ్‌లో మరో కారు ఢీకొనడంతో కువైట్ మహిళ మరణించిందని, ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నలుగురి మృతదేహాలను ఫోరెన్సిక్‌కు తరలించామన్నారు.
ఈజిప్షియన్ సెక్యూరిటీ గార్డు మృతి: మహ్బౌలాలోని ఒక ప్రైవేట్ పాఠశాల స్విమ్మింగ్ పూల్‌లో లభించిన ఈజిప్షియన్ సెక్యూరిటీ గార్డు శవాన్ని ఫోరెన్సిక్స్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సబంధించి దర్యాప్తు కొనసాగుతుందని, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!