మానవ అక్రమ రవాణాపై కువైట్ ఉక్కుపాదం..!!
- October 03, 2025
కువైట్: మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడం కువైట్ కు అత్యంత ప్రాధాన్యతగా ఉందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) యాక్టింగ్ డైరెక్టర్ జనరల్, ఇంజనీర్ రబాబ్ అల్-ఒసైమి తెలిపారు. ఇటువంటి చట్టవిరుద్ధ పద్ధతుల్లో పాల్గొన్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన 2025 వ్యక్తుల అక్రమ రవాణా (TIP) నివేదికలో కువైట్ పురోగతి సమిష్టి ఫలితమని అన్నారు. వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా వరుసగా మూడు సంవత్సరాలుగా ఉన్న టైర్ 2 వాచ్ లిస్ట్ నుండి టైర్ 2 వర్గీకరణకు కువైట్ ఇటీవల అప్‌గ్రేడ్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. కువైట్ ప్రతిష్టను దెబ్బతీసే మరియు దాని భూభాగంలో నివసించే కార్మికులకు హాని కలిగించే పద్ధతులను సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు.
కార్మికుల హక్కులను కాపాడటానికి కఠినమైన నియంత్రణ చర్యలను కువైట్ అమలు చేస్తుందన్నారు. కార్మిక హక్కులు లేదా ఒప్పంద బాధ్యతల ఉల్లంఘనలను గుర్తించడానికి క్షేత్ర తనిఖీలను నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







