హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బాగ్దాద్‌కు విమాన సర్వీసులు ప్రారంభం

- September 11, 2022 , by Maagulf
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బాగ్దాద్‌కు విమాన సర్వీసులు ప్రారంభం

హైదరాబాద్: GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) నుంచి నేడు బాగ్దాద్‌కు మొదటి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్‌ ప్రారంభమైంది.ఫ్లై బాగ్దాద్ తొలి ఫ్లైట్ IF 462 హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 03.17 గంటలకు బయలుదేరి వెళ్లింది.

హైదరాబాద్-బాగ్దాద్‌ల మధ్య ఈ విమాన సర్వీసు వారానికి రెండుసార్లు – ఆదివారం, మంగళవారం, నడుస్తుంది.ఫ్లై బాగ్దాద్ ఫ్లైట్ IF 461 మంగళవారం 09.55 గంటలకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది.తిరుగు ప్రయాణంలో IF 462 అదే రోజు హైదరాబాద్ నుండి 10.55 గంటలకు బయలుదేరుతుంది. ఆదివారం, విమానం IF 461 11.55 గంటలకు HYD విమానాశ్రయానికి చేరుకుని, 12.55 గంటలకు తిరిగి బయలుదేరుతుంది. హైదరాబాద్‌లో మెడికల్ టూరిజానికి పెరుగుతున్న డిమాండ్‌కు బాగ్దాద్ విమాన సర్వీసు నిదర్శనం. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం ఇరాక్ నుండి భారతదేశాన్ని సందర్శించే వైద్య పర్యాటకుల సంఖ్య 10% పైగా ఉంది, ఇది క్రమంగా పెరుగుతోంది.

హెల్త్ కేర్ రాజధానిగా, అంతర్జాతీయ పర్యాటకులకు హైదరాబాద్ చాలా ప్రాముఖ్యత పొందింది. తక్కువ ఖర్చుతో, ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలతో, హైదరాబాద్ దేశంలోనే మెడికల్ టూరిజానికి ఊతమిస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇటీవల హైదరాబాద్-ఢాకా విమాన సర్వీసు ప్రారంభమైంది.ఈ దిశగా బాగ్దాద్ సర్వీసు రెండోది.

ఇరాక్ రాజధాని నగరాలైన బాగ్దాద్, కర్బలాలకు చారిత్రక, మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ప్రతి యేడాదీ వేలాది మంది భారతీయులు బాగ్దాద్, కర్బలాకు ప్రయాణిస్తుంటారు. పవిత్ర నగరం కర్బలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి, ఇది బాగ్దాద్ సమీపంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ముస్లింలు సంవత్సరానికి రెండుసార్లు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.ఇరాక్‌లోని ఇతర ముఖ్య ప్రదేశాలు బాగ్దాద్‌లోని అబ్దుల్ ఖాదిర్ గిలానీ మరియు నజాఫ్‌లోని ఇమామ్ అలీ యొక్క పుణ్యక్షేత్రాలు.టైగ్రిస్ నదిపై ఉన్న బాబిలోనియా శిధిలాలను కూడా భారతీయులు సందర్శిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com