ఒమన్‌లో రెండు ప్రధాన రోడ్ల సామర్థ్యం పెంపు

- September 12, 2022 , by Maagulf
ఒమన్‌లో రెండు ప్రధాన రోడ్ల సామర్థ్యం పెంపు

మస్కట్: అల్ మౌజ్, 18 నవంబర్ స్ట్రీట్స్‌లో రోడ్ల సామర్థ్యాన్ని పెంచనున్నారు. దీనికి సబంధించిన విస్తరణ ప్రాజెక్టుల పనులు త్వరలో ప్రారంభమవుతాయని మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. దీంతో ఈ రోడ్లపై వాహన కదలికలు పెరుగుతాయన్నారు. ఈ ప్రధాన రోడ్లను మూడు లేన్‌లుగా విస్తరించనున్నారు. అల్ మౌజ్ రౌండ్‌అబౌట్, అల్ అల్ హైల్ నార్త్‌లోని బహ్జా రౌండ్‌అబౌట్, అల్ ఇష్రాక్ రౌండ్‌అబౌట్ అధిక వాహన సామర్థ్య కూడళ్ల విస్తరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మునిసిపాలిటీ అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com