పాకిస్థాన్‌లో సౌదీ విమానానికి తప్పిన ప్రమాదం
- September 12, 2022
జెడ్డా: పాకిస్థాన్‌లోని కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ ప్రయాణీకుల విమానానికి పెను ప్రమాదం తప్పింది. బోయింగ్ 330 విమానం జెడ్డా నుంచి పాకిస్థాన్‌కు ప్రయాణికులతో వెళ్లింది. శుక్రవారం కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా.. ఇంజిన్‌ను పక్షి ఢీకొట్టింది. అయితే, పైలట్ విమానాన్ని విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రాయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై సౌదీ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రయాణీకుల విమానం SV 700 ఇంజిన్ నంబర్ 1ను పక్షి ఢీకొట్టిందన్నారు. విమానాన్ని తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. విమాన ఇంజినీరింగ్ సిబ్బంది మరమ్మతు పనులు ప్రారంభించారని తెలిపారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం