దుబాయ్ లో రికార్డు సమయంలో వాహన దొంగ అరెస్ట్
- September 12, 2022
దుబాయ్: అల్ రఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రేడింగ్ స్టోర్ ముందు పార్క్ చేసిన వాహనాన్ని దొంగిలించిన ఒక వ్యక్తిని దుబాయ్ పోలీసులు రికార్డు సమయంలో అరెస్టు చేశారు. దొంగతనం జరిగినట్లు సమాచారం అందగానే పోలీసులు వెంటనే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. బృందం నిరంతర ఫాలో-అప్ ద్వారా.. దొంగిలించిన వాహనాన్ని గుర్తించి, నేరస్థుడిని దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. అల్ రఫా పోలీస్ స్టేషన్ యాక్టింగ్ డైరెక్టర్ కల్నల్ ఖలీఫా ఖలీద్ అల్ అవడీ కేసు వివరాలను వెల్లడించారు. ఒక దుకాణం ముందు పార్క్ చేసిన కారు దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్ కు సమాచారం అందిందన్నారు. వెంటనే కారును వెతకడానికి పెట్రోలింగ్ సిబ్బందించి సమాచారం చేరవేశామని, దీంతో రికార్డు సమయంలో వాహనాన్ని గుర్తించి, దొంగను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. కారును కనిపెట్టి, నేరస్థుడిని పట్టుకున్న సెర్చ్ టీమ్ ను అల్ అవడీ ప్రశంసించారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం