అక్రమంగా డిజీల్ రవాణా. 8 మంది ప్రవాసుల అరెస్ట్

- September 12, 2022 , by Maagulf
అక్రమంగా డిజీల్ రవాణా. 8 మంది ప్రవాసుల అరెస్ట్

మస్కట్: అక్రమంగా ఓ ఓడలో డీజిల్ రవాణా చేస్తున్న 8 మంది ప్రవాసులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒమన్ సుల్తానేట్ ప్రాంతంలోని సముద్రంలో  ఓ చెక్క ఓడలో భారీగా డీజిల్ ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కోస్ట్ గార్డు పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారం ఉండటంతో ఓ ఓడపై దాడి చేశారు. 8 మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు. ఓడను, డీజిల్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలుంటాయని పోలీసులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com