బహ్రెయిన్, కువైట్ మున్సిపల్ మంత్రుల సమావేశం

- September 12, 2022 , by Maagulf
బహ్రెయిన్, కువైట్ మున్సిపల్ మంత్రుల సమావేశం

మనమా: బహ్రెయిన్, కువైట్ దేశాలు మున్సిపాలిటీ వ్యవహారాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) మున్సిపల్ వ్యవహారాల మంత్రుల 25వ సమావేశం మనమా లో జరిగింది. ఈ సందర్భంగా బహ్రెయిన్, కువైట్ మున్సిపల్ మంత్రులు వేల్ బిన్ నాసర్ అల్ ముబారక్, డాక్టర్ రాణా అబ్దుల్లా అబ్దుల్‌రహ్మాన్ అల్ ఫారిస్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బహ్రెయిన్-కువైట్ మధ్య సంబంధాలపై చర్చించారు. మున్సిపల్ రంగంలో స్కిల్, టెక్నాలజీ ని మరింత పెంపొందించుకునేందుకు రెండు దేశాల సహకరించుకోవాలని నిర్ణయించారు. అదే విధంగా పర్యావారణాన్ని రక్షించేందుకు మున్సిపాలిటీల్లో చెట్లను పెంచాలని సమావేశంలో తీర్మానించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com